- డిసెంబర్ 7న (ఆదివారం) తిరుమల సాయి హైస్కూల్ ఆధ్వర్యంలో నమూనా పరీక్ష.
- డిసెంబర్ 5లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి.
జియ్యమ్మ వలస మండలం: జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల కోసం ఒక మెగా మోడల్ టెస్ట్‌ను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. జియ్యమ్మ వలస మండలం, పెదమేరంగి జంక్షన్లో, ఉమ్మడి జిల్లాలో జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలలో గతంలో 143 సీట్లతో అగ్రగామిగా నిలిచిన తిరుమల సాయి హైస్కూల్ లో పెదమేరంగి జంక్షన్ ఈ మెగా మోడల్ టెస్ట్ – 2026 వ సంవత్సరం గాను నిర్వహిస్తోంది. గత 20 సంవత్సరాలుగా నవోదయ ప్రవేశ పరీక్షకు శిక్షణ ఇస్తున్న ఈ సంస్థ, విద్యార్థులు తమ సన్నద్ధతను పరీక్షించుకోవడానికి, పరీక్షా విధానంపై అవగాహన పెంచుకోవడానికి ఈ నమూనా పరీక్ష ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. పరీక్ష తేదీ, డిసెంబర్ 07 వ తేదీన ఆదివారం నిర్వహిస్తున్నారు.డిసెంబర్ 05 వ తేదీ లోపు ఆసక్తి గల అభ్యర్థులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవడానికి,గూగుల్ ఫారం లింక్ ద్వారా గానీ, లేదా నేరుగా పాఠశాలను సంప్రదించడం ద్వారా గానీ, లేదా 9989273672, 9866118298, 7780646106 ఫోన్ నెంబర్ ద్వారా గానీ నమోదు చేసుకోవాలని పాఠశాల యాజమాన్యం కోరుతోంది. నవోదయ సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులు ఈ మెగా మోడల్ పరీక్ష అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుమల సాయి హైస్కూల్ యాజమాన్యం పిలుపునిచ్చింది.










