రాజన్న సిరిసిల్ల జిల్లా : వేములవాడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ విప్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని వేములవాడలో ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ లను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తో పాటు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వెళ్లారు. నిర్మాణాలను పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఫ్లోరింగ్ కుంగిపోయింది. ఎమ్మెల్యే, కలెక్టర్ లు కింద పడిపోతుండగా సిబ్బంది పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. నాణ్యత లోపం వల్లే ఫ్లోరింగ్ కుంగినట్లు సమాచారం.










