తిరుపతి రూరల్ : తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం మల్లంగుంట గ్రామంలో అన్నదాత సుఖీభవ ఇంటి ఇంటి ప్రచార కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. ముందుగా మల్లంగుంట గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే కి మహిళలు హారతులు పట్టి తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులకు సంవత్సరానికి 20 వేలు విడతల వారీగా ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం. 14 వేల రూపాయలను ఆగస్టు, నవంబర్ లో రెండు విడతలవారీగా రైతుల ఖాతాలో జమ చేసిందని తెలిపారు. ఇంటి ఇంటి వెళ్లి అన్నదాత సుఖీభవ పథకం గురించి రైతులకు వివరించిన ఎమ్మెల్యే… పార్టీ మూల సిద్దాంతంలో రైతు సంక్షేమం ఉంది… పార్టీ జెండాలో నాగలి గుర్తు ఉంది…. కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పథకంలో అర్హులైన 26062 మంది రైతులకు 17.61 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. సాదారణ రైతు కుటుంబం నుంచి బయటకు వచ్చి రాజకీయంలో తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి రైతుల కష్టాలు తెలుసునని….కష్టకాలంలో రైతులను ఆదుకునే దిశగా ముందుచూపుతో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అందులోభాగంగా పలు దఫాలు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి వారిని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతు కష్టాలను చూసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ…… మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేజీకి 8 రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. రైతులకు సబ్సిడీ వ్యవసాయ యాంత్రికరణ పరికరాలు, గోకులం షెడ్లు,యూరియా, విత్తనాలు, సెనగకాయలు, డ్రిప్పు పైపులు, ఇతర వస్తువులను సబ్సిడీ ద్వారా రైతులకు కూటమి ప్రభుత్వం అందించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అన్నదాత సుఖీభవ పథకం అందని రైతులు తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ ఆధార్, బ్యాంకు ఖాతాకు మరియు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డుకు అనుసంధానం చేసుకోవాలని కోరారు. సంక్షేమ పథకాన్ని రైతులకు వివరించడమే కాకుండా గ్రామంలోని పలు సమస్యలపై ఆరా తీసి రోడ్డు సమస్య ఉందని తెలుసుకొని ఒక కోటి 50 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.










