కరీంనగర్ జిల్లా: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులు, సిబ్బంది చేత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశ రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు వుందని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, దేశ అభివృద్ధికి కట్టుబడి వుండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఏవో సుధాకర్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.









