తిరుపతి జిల్లా, పాకాల : తిరుపతి జిల్లా పాకాల మండలం స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నందు ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను బుధవారం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంనకు ఇన్చార్జి ప్రిన్సిపాల్ పి. హరినాధ ఆచ్చారి అధ్యక్షతన కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా సమావేశాన్ని నిర్వహించి ప్రతిజ్ఞను విద్యార్థుల చేత పలికించారు. కళాశాల నుంచి విద్యార్థులు అధ్యాపకులు అధ్యాపకేత్రం సిబ్బంది ర్యాలీగా పాకాల లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి ఇన్చార్జి ప్రిన్సిపాల్ పి. హరినాధ ఆచ్చారి పూలమాలను వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గీఘతాంజలి లైబ్రరీ యన్ చెంగల్ రాజు ఎన్ ఎస్ ఎస్ పి ఓ ఏ మునిరాజా, చలమారెడ్డి, గిరిజ, బాలు, ఆనంద్, హరి శ్రీనివాస ప్రసాద్, సుభాషిని తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.









