తిరుపతి జిల్లా, పాకాల : తిరుపతి జిల్లా పాకాల మండలం ఊట్లవారి పల్లి నందు వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయం వద్ద బుధవారం సుబ్రమణ్య షష్టి సందర్భంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికీ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన పాల్గొన్నారు. కళ్యాణ అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శించుకున్న పులివర్తి సుధా రెడ్డికి ఆలయ చైర్మన్ ఈవో అర్చకులు తీర్థ ప్రసాదన్న అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు అధికారులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









