కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్ కమిటిని పక్కన పెట్టి ప్రెస్‌క్లబ్‌ను వ్యక్తిగత యాజమాన్యంలా నడపాలన్న అధ్యక్షుడు రతన్‌కుమార్ ప్రయత్నాలకు చెక్ పడింది. ఆయనపై సభ్యుల తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తడంతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కమిటీ ఏకగ్రీవంగా నాయకత్వ మార్పుకు మొగ్గుచూపింది. కాగజ్ నగర్ ప్రింట్, ఎలక్ట్రానికల్ మీడియా రిజిస్ట్రేషన్ నం.259 ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఆమద్ పాషా ను శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు క్లబ్ గౌరవాధ్యక్షుడు పడాల వెంకన్న, ప్రధాన కార్యదర్శి ఈర్ల. సతీష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత అధ్యక్షుడు రతన్‌కుమార్ కార్యకలాపాలపై కమిటీ సభ్యులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. సభ్యులను పట్టించుకోకుండా ఒంటరిగానే నిర్ణయాలు తీసుకోవడం, కమిటీని అపహాస్యం చేసే రీతిలో ప్రవర్తించడం వంటి కారణాలతో ప్రెస్ క్లబ్ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని . కమిటీ సభ్యుల ఫిర్యాదుల నేపథ్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నామని తెలిపారు. అనంతరం కొత్త అధ్యక్షుడు అహ్మద్ పాషా మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి కృషి చేస్తానని, మీడియా మిత్రులు, కమిటీ సభ్యులతో సంప్రదింపులు జరుపుకుంటూ నిర్ణయాలు తీసుకుంటానని అవకాశం ఇచ్చినందుకు గౌరవాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి , సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.










