కరీంనగర్ జిల్లా: గన్నేరువరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గౌడ సంఘం బలపరిచిన అభ్యర్థి బుర్ర తిరుపతి గౌడ్ సోమవారం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేయడం జరిగింది.. ముందుగా గౌడ సంఘం నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి మరియు తెలంగాణ తల్లి విగ్రహానికి ఇందిరాగాంధీ విగ్రహానికి వివేకానంద విగ్రహానికి బుర్ర తిరుపతి గౌడ్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా బుర్ర తిరుపతి గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో పార్టీలతో సంబంధం లేకుండా గ్రామాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు, పెద్దఎత్తున పాల్గొన్నారు.










