గుంతకల్ పట్టణంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా మరియు విక్రయంపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో CI మనోహర్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం రైల్వే స్టేషన్ సమీపంలో దాడులు నిర్వహించారు.
గంజాయి నిల్వ ఉంచి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మేరకు జరిగిన ఈ దాడిలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 2.5 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ పరిసరాల్లో ఎలాంటి మత్తు పదార్థాల విక్రయం లేదా అసాంఘిక కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు హామీ ఇచ్చారు.
ఇలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, యువత ఆరోగ్యం కాపాడేందుకు సమాజం మొత్తం కలిసి పనిచేయాలని ఇన్స్పెక్టర్ మనోహర్ సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనేవారి మీద కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.










