తూప్రాన్ డివిజన్ – డిసెంబర్ : గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు భారతి లక్పతి మంగళవారం తూప్రాన్ డివిజన్‌లోని నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. చేగుంట, శంకరంపేట (ఏ) మండలాల్లో, మెదక్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా నామినేషన్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని పరిశీలకురాలు పలు సూచనలు చేశారు. రిజిస్టర్లను పరిశీలించి, నామినేషన్ పత్రాల స్వీకరణ ప్రక్రియను నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారా అన్నది సమీక్షించారు.
అదే విధంగా, ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల సామాగ్రి అందుబాటు పరిస్థితిని పరిశీలించారు. సజావుగా పోలింగ్ నిర్వహణ కోసం అవసరమైన మెటీరియల్ పూర్తిగా సిద్ధంగా ఉందో లేదో ఖచ్చితంగా పరిశీలించుకోవాలని ఆమె సూచించారు.
ఎన్నికల సంఘం విధానాలు, నియమ నిబంధనలు పాటిస్తూ నామినేషన్ ప్రక్రియ కొనసాగాలని పరిశీలకురాలు ఆదేశించారు.










