కరీంనగర్ జిల్లా: గన్నేరువరం గ్రామానికి చెందిన బుర్ర తిరుపతి గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు నాయకులు నామినేషన్ వేయగా ఇందులో బుర్ర తిరుపతి గౌడ్ ని కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచారు, ఈ సందర్భంగా తిమ్మాపూర్ ఎమ్మెల్యే ప్రజా పాలన కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గన్నేరువరం నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి తిరుపతి గౌడ్ కి మద్దతు ఇచ్చి గెలిపించాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.. ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు బొడ్డు సునీల్, బూర వెంకటేశ్వర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్, గ్రామ శాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశరాజ్ అనిల్,యూత్ నాయకులు రాపోలు నవీన్, మండల నాయకులు బుర్ర మల్లేశం గౌడ్, బుర్ర నర్సయ్య గౌడ్, న్యాత జీవన్, మహంకాళి మల్లికార్జున్,బుర్ర సన్నీ తదితరులు పాల్గొన్నారు










