పల్నాడు జిల్లా కారంపూడి విద్యుత్ శాఖ ఏఈ పెద్దకోట మస్తాన్, ఏసీబీ వలలో పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే… కారంపూడిలో వలి ఇంజనీరింగ్ పేరిట షాపు నడుపుతున్న షేక్ మస్తాన్ జానీ నుంచి, మీటర్ ఫిక్సింగ్ కోసం లంచం అడిగినట్టు తెలుస్తోంది. దీనితో విసుగు చెందిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, ఏసీబీ అధికారుల పథకం ప్రకారం లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ రైడ్ లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర, సీఐలు నాగరాజు, సుబ్బారావు, మన్మధరావు, సురేష్ బాబు, అలాగే ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.










