మెదక్ జిల్లా / తూప్రాన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులో ఉన్న నేపథ్యంలో, తూప్రాన్ డివిజన్ పరిధిలో ఏర్పాటుచేసిన FST (Flying Squad Team) తనిఖీలలో (3) మండలాలలో (చేగుంట, మనోహరాబాద్, తూప్రాన్ )ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా తరలిస్తున్న మొత్తం దాదాపు రూ.36 లక్షల నగదు స్వాధీనం చేయబడింది అని తెలిపారు. అలాగే ఈ రోజు తూప్రాన్ ఎంపీడీవో కార్యాలయం లో ఆర్వో, మరియు ఏఆర్ఓ లతో సమావేశం నిర్వహించి జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు, పోలింగ్ మెటీరియల్ భద్రత, పోలీసు బందోబస్తు, రిసీవింగ్ & డిస్పాచ్ సెంటర్ల నిర్వహణ పై వివరించారు. అధికారులు ఎం సి సి నిబంధనలు ఖచ్చితంగా పాటించి, ఎలాంటి ఉల్లంఘ నలకు అవకాశం ఇవ్వకుండా చూడాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లలో సౌకర్యాలు, క్యూలైన్ మేనేజ్‌మెంట్ సహాయక డెస్క్‌లు వృద్ధులు మరియు దివ్యాంగులకు తగిన సదుపాయాలు అందుబాటులో ఉండేటట్టు చూడాలని ఆదేశించారు ఎన్నికలు శాంతి యుతంగా పార దర్శకంగా జరిగేందుకు అధికారులు సమ న్వయం తో పని చేయాలని ఓటర్లు ఎలాంటి ఒత్తిడులు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వాతావరణం కల్పించడం తమ ప్రధాన బాధ్యత అని ఆర్డీవో తూప్రాన్ జయ చంద్రా రెడ్డి పేర్కొన్నారు.









