కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన యువకుడు కన్నెపల్లి కార్తీక్ బైక్ పై వెళ్తూ ట్రాక్టర్ ఢీకొని తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మరణించగా. కార్తీక్ అంత్యక్రియలకు హాజరై పాడె మోశారు. కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, గత పాలకులు పట్టించుకోక పోవడంతో, ఇరుకైన గుంతల రోడ్ల వల్ల తరచూ ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం,ప్రస్తుత బిజెపి ఎమ్మెల్యే హరీష్ బాబు చేతకానితనం వల్ల యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. వెంటనే రోడ్లకు మరమ్మత్తులు చేయించి,ఇరుకైన రోడ్లను వెడల్పు చేయాలని,మూలమలుపుల వద్ద ప్రయాణికులకు అర్థమయ్యేవిధంగా అధికారులు తగు సూచనలు ఇచ్చి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.









