జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద సాయి ఈశ్వర చారి చిత్రపటానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు సాయిని పాపన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి జోరిగే రజిత,పట్టణ అధ్యక్షులు కొలగాని శ్రీనివాస్,కోరుట్ల నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు జైనూద్దీన్ ఆధ్వర్యంలో స్థానిక బీసీ సంఘ నాయకులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి ఈశ్వర చారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… బీసీలకు 42శాతం ఇస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ లో హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడ్డాక రిజర్వేషన్ రద్దు చేయడం వల్ల మనోవేదనకు గురైన బీసీ బిడ్డ సాయి ఈశ్వర చారి అగ్నికి ఆహుతి అవడం దురదృష్టకరమన్నారు. మృతుని కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేశారు. ఇప్పటివరకు బీసీలను ఓట్ల కోసం వాడుకొని అభివృద్ధికి దూరంగా ఉంచిన రెడ్డి రావులపై తిరుగుబాటు మొదలైందని దానికి చారి మరణం నిదర్శనంగా భావించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుందన్నారు.









