పెదమేరంగి : పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలం పెదమేరంగి సెంటర్లో శ్రీ సత్య కైలాస్ స్కూల్ డైరెక్టర్ శ్రీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జవహర్ నవోదయ మోడల్ టెస్ట్ కు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించింది. నవోదయ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మార్గదర్శకంగా ఏర్పాటు చేసిన ఈ పరీక్షలో 148 మంది విద్యార్థులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విభాగాల వారీగా ప్రతిభా ప్రదర్శన
ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ప్రథమ ర్యాంక్
లావణ్య త్రిపాఠి (ఎంపీపీ స్కూల్, పాత్రువాని వలస)ప్రైవేట్ పాఠశాలల విభాగంలో ప్రథమ ర్యాంక్
బంటు మిథున్ కుమార్ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ద్వితీయ ర్యాంక్
ఉదయశ్రీ (మండల పరిషత్ స్కూల్, లక్నాపురం)ఇంగ్లీష్ మీడియం విభాగంలో ప్రథమ స్థానం
జే. నాగ శౌర్య
పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. రాజశేఖర్ రావు షీల్డ్స్ మరియు సర్టిఫికెట్లు అందజేశారు. విద్యా ప్రమాణాలు పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అకాడెమిక్ ఇంచార్జ్ పి. హరికృష్ణ, జి. ఉమామహేశ్వరరావు సహా ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొని విద్యార్థులను శుభాకాంక్షలు తెలియజేశారు.
నవోదయ లక్ష్యంతో ముందుకు సాగుతున్న విద్యార్థులకు పెదమేరంగిలో నిర్వహించిన ఈ మోడల్ టెస్ట్ స్ఫూర్తి నింపిన కార్యక్రమంగా నిలిచింది.










