గుత్తి, అనంతపురం జిల్లా : దేశవ్యాప్తంగా పోలియో నిర్మూలన లక్ష్యంగా జరగనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నేపథ్యంలో, గుత్తి మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు కార్యాలయంలో అవగాహన–శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు అంగన్వాడీ కార్యకర్తలకు కార్యక్రమం నిర్వహణపై పూర్తిస్థాయి సూచనలు అందించారు.
పోలియో నిర్మూలన కోసం “నిండు జీవితానికి రెండు చుక్కలు” అనే నినాదంతో డిసెంబర్ 21వ తేదీన పుట్టిన చిన్నారుల నుండి ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు పడేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో—
మొదటి రోజు: ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలకు వచ్చే చిన్నారులకు రెండు చుక్కలు పడతాయి.
రెండవ, మూడవ రోజులు: అంగన్వాడీ సిబ్బంది డోర్ టు డోర్ వెళ్లి సర్వే నిర్వహించి, టీకా వేయని పిల్లలను గుర్తించి చుక్కలు వేయాలని సూచించారు.
శిక్షణా కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ (మెడికల్ ఆఫీసర్, బేతపల్లి), డాక్టర్ అమర్నాథ్ (యుపిహెచ్సి, చెట్నేపల్లి), డాక్టర్ ఆయేష (జంగాల కాలనీ), డాక్టర్ రమ్య, హెల్త్ సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఐసిడిఎస్ సూపర్వైజర్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అధికారులు ప్రతి చిన్నారి తప్పనిసరిగా రెండు చుక్కలు పొందేలా గ్రామగ్రామాన ప్రచారం చేయాలని సూచించారు.










