అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో సర్వేనెంబర్ 327లో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వందల సంఖ్యలో గుత్తి తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి వి నిర్మల మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా స్థానిక పట్టణ పరిధిలో అద్దె ఇంటిలో నివసిస్తున్న కుటుంబాలు బాడుగలు చెల్లించలేక, పిల్లల చదువులు కు నోచుకోని దుస్థితి ఏర్పడుతున్నాయి. కనుక తక్షణమే స్పందించి అర్హులైన పేదవారికి పట్టాలు మంజూరు చేయాలని డిప్యూటీ తాసిల్దారు సూర్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి సంఘం కార్యదర్శి రేణుక, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మల్లేష్, కెవిఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున, సిఐటియు కార్యదర్శిరమేష్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి నవీన్, రామేశ్వరి, నారాయణ స్వామి, వన్నూరమ్మ, ఊర్మిళ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు










