- నాలుగవ అంతస్తు నుంచి ఎలా దిగుతారు ? ఎలా ఎక్కుతారు ?
- అర్ధరాత్రి అన్నం కోసం బయటకు వెళ్లారంటే అర్థం ఏమిటి ?
- మీరు అన్నం పెట్టడం లేదనా..? ఆ అన్నం బాగలేదనా ?
- ఈ ప్రశ్నలకు నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం సమాధానం చెప్పాలి
- వైయస్ ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుల్ రెడ్డి..
తిరుపతి రూరల్ : చదువుల ఒత్తిడిని భరించలేకనే మహీధర్‌రెడ్డి అనే యువకుడు ఆత్మహత్యాయత్నంకు పాల్పడితే ఆ విషయం పక్కదారి పట్టించి అర్ధరాత్రి ఆ పిల్లాడు అన్నం కోసం దొంగ దారిలో బయటకు వెళ్లే ప్రయత్నం చేసి కింద పడినట్టు కళాశాల సిబ్బంది చెబుతున్నారు.. అంటే అర్ధరాత్రి వరకు అన్నం పెట్టలేదా ? ఒక వేళ మీరు అన్నం పెట్టినా అది బాగోలేక బయట తినడానికి వెళ్లారా ? అది కూడా నాలుగవ అంతస్తు నుంచి కిందకు ఎలా దిగుతారు ? మళ్లీ ఎలా ఎక్కుతారు ? రెండు చేతులు కూడా సక్రమంగా పట్టని కిటికీ నుంచి కొందకు దూకారని చెబితే ఎవ్వరు నమ్ముతారన్న ఆలోచన కూడా కాలేజీ సిబ్బంది కళ్లబొల్లి మాటలు చెబుతున్నారంటే వీరిని ఏమనాలి..? నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుల్‌రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు చెంగల్రెడ్డిలు డిమాండ్ చేశారు.
చంద్రగిరి మండలం అగరాల వద్దనున్న నారాయణ విద్యాసంస్థలో అన్నమయ్యజిల్లా కలికిరికి చెందిన మహీధర్‌రెడ్డి అనే యువకుడు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతు వున్నాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆ యువకుడు రక్తపు గాయాలతో పడుండగా కాలేజీ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఏం జరిగిందని ఆరా తీయగా అతను కిటికీలో నుంచి బయటకు వచ్చి పైపుల ద్వారా కిందకు దిగే ప్రయత్నంలో కిందపడి దెబ్బలు తగిలినట్టు బుకాయిస్తున్నారన్నారు. నిజంగా పైపుల ద్వారా కిందకు దిగాలని అనుకుంటే చేయి జారితే చచ్చిపోతామని ఆ పిల్లాడికి తెలియదా..? ప్రాణాలకు తెగించి అన్నం కోసం బయటకు వెళతరా ? కాలేజీ సిబ్బంది చెబుతున్న మాటలు చూస్తుంటే అనుమానంగా వుందని, ఆ పిల్లాడిపై చదువుల ఒత్తిడి తేవడం వల్లనే తట్టుకోలేక ఆత్మహత్యప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోందన్నారు. నిజాలు బయటకు రావాలంటే పోలీసులు నిశ్పక్షపాతంగా విచారణ జరపాలని, నారాయణ విద్యాసంస్థల యజమాని రాష్ట్ర మంత్రి కావడం వల్ల పోలీసులు ఆ కేసును అణగదొక్కుతారు తప్ప లోతుగా విచారణ చేపట్టరని ఆరోపించారు. లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేసే నారాయణ విద్యాసంస్థల యజమాన్యం పిల్లల రక్షణలో అశ్రద్ధ చూపడం పట్ల విద్యార్థుల సంఘం నుంచి పోరాడుతామని, అవసరమైతే న్యాయ స్థానాల్లో కేసులు వేస్తామని హెచ్చరించారు. అంతకుముందు రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణ విద్యాసంస్థ ముందు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండలం విద్యార్థి విభాగం అధ్యక్షులు వినోద్, ఎస్వీయూ అధ్యక్షులు ప్రేమ్‌కుమార్, ఆర్సీపురం అధ్యక్షులు యశ్వంత్‌రెడ్డి, వైవీపాలెం అధ్యక్షులు శేషారెడ్డి, ఎన్ఎల్ఎస్ఏ విద్యార్థి నేత సుందర్, బీఎన్ఎస్ విద్యార్థి సంఘం నేత విక్రమ్ యాదవ్, బీసీ స్టూడెంట్ యూనియన్ నాయకులు తిరుమలేశులు పాల్గోన్నారు.










