- చేతకాని వృద్ధురాలిని వీల్ చైర్ లో తీసుకొచ్చి ఓటు వేయించిన రేగోడ్ ఎస్సై పోచయ్య మనోహరాబాద్ కానిస్టేబుల్ రాధాకృష్ణ
- ఓటు హక్కు విలువను చాటి చెప్పారని కానిస్టేబుల్ రాధాకృష్ణకు పలువురు అభినందనలు
మనోహరాబాద్ – తూప్రాన్ డివిజన్ : మెదక్ జిల్లా లో మొదటి విడత స్థానిక పంచాయతీ ఎన్నికలు గురువారం జరగగా ఎన్నికల అధికారులు అదే రోజు సాయంత్రం సర్పంచ్ వార్డు ఎన్నికల ఫలితాలు ప్రకటించారు.ఇందులో భాగంగా రేగోడ్ ఎస్సై పోచయ్య మనోహరాబాద్ కానిస్టేబుల్ రాధాకృష్ణ చేసిన పనిని సామాజిక వేత్తలు ప్రశంసిస్తున్నారు.రేగోడ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పోచయ్య మనోహరాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రాధాకృష్ణ స్థానిక ఎన్నికల్లో భాగంగా అటు రేగోడ్ లోను ఇటు హవేళీ ఘణపూర్ మండలం లింగసానిపల్లి లో బందోబస్తు కోసం వెళ్లారు.అక్కడ ఓ వృద్ధురాలు నడవలేక ఎన్నికల కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్న సంగతి గమనించిన ఎస్సై పోచయ్య కానిస్టేబుల్ రాధాకృష్ణ ఎన్నికల నియమావళి అనుసరించి ఆ వృద్ధురాలిని స్వయంగా వీల్ చైర్ లో తీసుకెళ్లి ఓటు హక్కును వినియోగించేలా సహాయం అందించారు.
ఓటు హక్కు చాలా విలువైందని చాటిచెప్పిన ఎస్సై పోచయ్య, కానిస్టేబుల్ రాధాకృష్ణ పనితీరు పై అధికారులు సామాజిక వేత్తలు సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు.










