పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం ఎంపీపీ ఎన్నికల్లో భారీ ట్విస్ట్. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ మార్పులు చివరకు టీడీపీకి అనుకూలంగా మారాయి.
మాచవరం మండలంలో మొత్తం 15 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా… ఒకరు మరణించడంతో ప్రస్తుతం సభ్యుల సంఖ్య 14కు తగ్గింది. వారిలో 11 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.
ఈ 11 మందిలో ఆరుగురు టీడీపీకి, నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించగా… ఒకరు తపస్తంగా నిలిచారు.
అయితే నిన్న జరిగిన కీలక పరిణామంలో—మాచవరం ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నుంచి ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు టీడీపీలోకి చేరడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
ఇప్పటివరకు టీడీపీకి నలుగురు మాత్రమే ఉంటే… ఈ చేరికలతో టీడీపీ సంఖ్య ఆరుగుకు పెరిగి, చివరకు ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం అయింది.
మాచవరం మండలానికి కొత్త ఎంపీపీగా
పిల్లట్ల గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు కొక్కెర అంజమ్మ పదవిని అధిరోహించారు.
ఇందువల్ల మాచవరం మండల రాజకీయాల్లో టీడీపీ మళ్లీ బలపడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.










