కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా, విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ కార్యాలయం ప్రకటించింది.
గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న ప్రజానుకూల నిర్ణయాలకు ప్రజలు ఇచ్చిన మద్దతుకు డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల ప్రగతి, శ్రేయస్సు కోసం ఎన్నికైన ప్రతినిధులు అంకితభావంతో పనిచేయాలనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలపరిచిన ప్రతి ఓటరుకూ ధన్యవాదాలు తెలియజేస్తూ…
విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియచేశారు.










