- ఐక్య విద్యార్థి సంఘం డిమాండ్
- (వైయస్సార్ ఎస్ యు, ఎన్ ఎస్ యు ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ ఎల్ ఎస్ ఏ, ఎస్ఎఫ్ఐ, ఏపీ విహెచ్ఎస్, బీడీఎస్, ఎం ఎస్ జె)
తిరుపతి : చదువుల ఒత్తిడి భరించలేకనే మొదటి సంవత్సరం చదువుతున్న కుప్పం ప్రాంతానికి చెందిన జశ్విన్ అనే విద్యార్థి ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డాడు. పదో తారీఖున ఉదయం 8 గంటల ప్రాంతంలో తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఎన్నారై కళాశాల యందు విద్యార్థి మొదటి సంవత్సరం బైపిసి చదువుతున్నాడు .ఈ విద్యార్థిపై అక్కడున్నటువంటి కళాశాల అధ్యాపక బృందంలో ఒక వ్యక్తి కులం పేరుతో దూషించడం నువ్వు చనిపోతే ఎవరికి నష్టం లేదనడం నువ్వు చనిపోతే ఒకరోజు కళాశాలకు సెలవు వస్తుందని చెప్పడం ఆ విధంగా మానసికంగా వేధించడం చదువుల ఒత్తిడి తీసుకొని రావడం ఈ ప్రయత్నంలో భాగంగా ఆ విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. కళాశాల యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి నుంచి డబ్బులు పంపమని ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది తల్లిదండ్రులు అక్కడి నుంచి వెంటనే తిరుపతికి చేరుకొని ఆసుపత్రికి వెళ్లడం జరిగింది అక్కడికి పోయేంతవరకు తల్లిదండ్రులకు తమ కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశాడని విషయం కూడా తెలియదు .ఇప్పటికైనా కళాశాలలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకొని రావడం తగ్గించాలని విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది .విద్యార్థికి న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని విద్యార్థి సంఘ నేతలు కళాశాల ఎదుటనే బయటాయించడం జరిగింది. విద్యార్థి సంఘాలు కళాశాల ముందు రెండు గంటలు ధర్నా నిర్వహించిన కళాశాల యజమాన్యం నుంచి స్పందన కరువైంది ఆ తరువాత అకాడమిక్ సీఈవో అక్కడికి చేరుకొని విద్యార్థికి మెరుగైనటువంటి వైద్యం అందిస్తామని ఇలాంటివి మళ్లీ జరగకుండా జాగ్రత్త పడతామని విద్యార్థికి రెండు సంవత్సరాల ఫీజు కూడా భరిస్తామని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేంతవరకు అక్కడే విద్యార్థి సంఘం నేతలు అక్కడే ఉన్నారు .ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ పెద్దలు కార్పొరేట్ కళాశాలలపై దృష్టి సాధించాలని ఇలాంటి సంఘటనకు సంబంధించినటువంటి కళాశాల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు .ఇప్పటికైనా తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్చేటువంటి కళాశాలలు సందర్శించి అక్కడున్నటువంటి వసతులను పరిశీలించి తమ బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలని విద్యార్థి సంఘం నేతలు తల్లిదండ్రులను కోరారు .
ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘం నేతలు డాక్టర్ బి ఓబుల్ రెడ్డి, స్వరూప్ కుమార్, శివ బాలాజీ, ప్రవీణ్, ప్రేమ్ కుమార్, చంగల్రెడ్డి, సుందర రాజు, తేజ, యుగంధర్, సుధాకర్ , యశ్వంత్ రెడ్డి, గూడూరు రఫీ, ప్రదీప్, పునీత్, వినోద్, నితిన్, నీరజ్ రెడ్డి, వెంకట్ నాయక్, వరుణ్, కరుణాకర్, ముని, తదితరులు పాల్గొన్నారు.










