మాసాయిపేట, తూప్రాన్ డివిజన్ : మాసాయిపేట పంచాయతీ ఎన్నికల సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి తన స్వగ్రామమైన మాసాయిపేటలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరు తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల చైతన్యం ద్వారానే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికలు గ్రామాభివృద్ధికి కీలకమని, ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములై గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించారు.










