మెదక్ జిల్లా – తూప్రాన్ డివిజన్ : రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా తూప్రాన్ పట్టణంలోని నరసాపూర్ చౌరస్తా వద్ద పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పూలు అందజేసి, హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
అలాగే హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న వాహనదారులను శాలువాలతో సన్మానించి ప్రోత్సహించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు.
ప్రధాన రహదారులపై ప్రయాణించే వాహనదారులు మలుపులు తిప్పే సమయంలో ముందు, వెనుక వాహనాల పరిస్థితిని గమనించి జాగ్రత్తగా నడపాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై–2 జ్యోతి, ఏఎస్ఐ వాణి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










