మాసాయిపేట మండలం | పోతన శెట్టిపల్లి : మాసాయిపేట మండలం పోతన శెట్టిపల్లి గ్రామానికి చెందిన వంగ విట్టల్ గౌడ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ జీవనం సాగిస్తున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన రెండు రోజులకోసారి ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి స్పందించి, వెల్దుర్తి బాలాజీ గార్డెన్‌లో వంగ విట్టల్ గౌడ్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన రూ.60,000 చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ, తన నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలతో ఉన్న ప్రజలైనా తన దృష్టికి తీసుకువస్తే ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలిచే భరోసా పార్టీ అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.










