తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మామిడి తోరణాలు తంగేడు పూలు రంగవల్లలు భోగి మంటలు పొంగళ్ళు కోలాటాలు సాంప్రదాయ వస్త్రధారణతో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. శుక్రవారం కళాశాలలో అధ్యాపకులు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగవల్లులు తీర్చిదిద్దారు. మహిళలు అధ్యాపకులు సాంప్రదాయబద్ధంగా పొంగళ్ళు సంక్రాంతి సంబరాలను ప్రాంగణానికి తీసుకువచ్చారు. భోగి మంటలు వెలిగించి అధ్యాపకులు అంతా చుట్టూ తిరుగుతూ గొబ్బియాలు తట్టడం ఆకట్టుకుంది. అమ్మాయిలు వేసిన కోలాటాలు ఆహుములను అలరించింది. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు డాక్టర్ ఎస్ వి రమేష్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మాశిలామణి, అధ్యాపకులు చిట్టి కళావతి, మోహన్ బెహరా, ఆదిశేఖర్ రెడ్డి, ఈశ్వర్ బాబు రమణమ్మ రేఖ కుమార్ రాజా మహబూబ్ బాషా ఢిల్లీ ప్రసాద్ విద్యార్థులు పాల్గొన్నారు.









