మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని రామయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గురువారం వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రామయంపేట సీఐ ఆశం వెంకట రాజా గౌడ్ మాట్లాడుతూ, తేదీ 05-01-2026 నాడు రాత్రి నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని జప్తి శివనూర్ గ్రామ శివారులో NH-44 రహదారిపై ఇద్దరు వ్యక్తులను కొట్టి, వారి వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లిన ఘటనలకు సంబంధించిన రెండు కేసులను పోలీసులు ఛేదించినట్లు తెలిపారు.
నేరస్థుల వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు మరియు ఒక ఆటోను స్వాధీనం చేసుకొని, వారిని రిమాండ్కు పంపినట్లు సీఐ వెల్లడించారు.
అలాగే, ఈ ముగ్గురు నేరస్థులపై గతంలో వివిధ జిల్లాల్లో మొత్తం 28 దొంగతన కేసులు నమోదై ఉన్నాయని సీఐ తెలిపారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెంచి, నేరాలను కట్టడి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.









