తూప్రాన్ : రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ… మున్సిపాలిటీ వార్డుల మహిళా రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగిందని *జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో… రిజర్వేషన్ ఖరారు ప్రక్రియ ని పారదర్శకం గా కలెక్టర్ నిర్వహించారు. జిల్లా లోని తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులకు రిజర్వేషన్ ఖరారు లో భాగం గా మున్సిపాలిటీ కి సంబందించి వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ బీసీ ల డెడికేషన్ కమిషన్ ప్రకారం, ఎస్.సి, ఎస్.టి లది 2011 జనాభ లెక్కల ప్రకారం, మహిళ రిజర్వేషన్ ను…జీవో 9 ప్రకారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్ కేటాయింపులు చేశామని ఈ సందర్బంగా కలెక్టర్ స్పష్టం చేసారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీకి సంబంధించిన వార్డు రిజర్వేషన్ల ప్రక్రియ శనివారం జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో పారదర్శకంగా పూర్తయ్యింది. ఈ ప్రక్రియ అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు నాయకుల సమక్షంలో నిర్వహించ బడింది. తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 16 వార్డులకు గాను రిజర్వేషన్లను అధికారికంగా ఖరారు చేసినట్లు అధికారులు ప్రకటించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి: 1వ వార్డు జనరల్ మహిళ, 2వ వార్డు జనరల్, 3వ వార్డు జనరల్, 4వ వార్డు ఎస్టీ, 5వ వార్డు బీసీ జనరల్, 6వ వార్డు మహిళా జనరల్, 7వ వార్డు బీసీ జనరల్, 8వ వార్డు బీసీ మహిళ 9వ వార్డు బీసీ జనరల్, 10వ వార్డు ఎస్సీ మహిళ, 11వ వార్డు ఎస్సీ జనరల్, 12వ వార్డు బీసీ మహిళ, 13వ వార్డు జనరల్, 14వ వార్డు మహిళా జనరల్, 15వ వార్డు మహిళా జనరల్, 16వ వార్డు మహిళా జనరల్‌గా నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నాగేష్ స్పెషల్ ఆఫీసర్ సంధ్య తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరై రిజర్వేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో ఆర్డీవోలు మున్సిపల్ కమిషనర్లు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.










