● వంగల లక్ష్మారెడ్డి ని సన్మానించిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
కరీంనగర్ జిల్లా: మానకొండూర్ నియోజవర్గం తిమ్మాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గన్నేరువరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఉపసర్పంచులు అందరు కలిసి ఏకగ్రీవంగా గుండ్లపల్లి గ్రామానికి చెందిన వంగాల లక్ష్మారెడ్డి ని ఉపసర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది..ఈ కార్యక్రమంలో గుండ్లపల్లి ఎక్స్ రోడ్ ఉపసర్పంచ్ వంగల జ్యోతి సత్తిరెడ్డి, చీమలకుంటపల్లి ఉపసర్పంచ్ ప్రవళిక, గోపాల్పూర్ ఉపసర్పంచ్ శంకర్,ఖాసీంపేట ఉప సర్పంచ్ ఐలయ్య, యాస్వాడ ఉపసర్పంచ్ భాగ్యలక్ష్మి, మాదాపూర్ ఉపసర్పంచ్ కళ్లెం అనిత , చాకలివానిపల్లి ఉపసర్పంచ్ కూన సంతోష్, పీచుపల్లి ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి జంగపల్లి ఉప సర్పంచ్ ప్రభాకర్, వీరి వెంట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..










