అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులో గల గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల మరియు రోడ్డు రవాణా సంస్థ తో కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల స్థానిక టోల్ ప్లాజా వద్ద గుంతకల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజాబాబు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు ప్రత్యక్షంగా పాల్గొని వాహనదారులు, ప్రయాణికులకు రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి వాహన డ్రైవర్‌కు ఒక గులాబీ పువ్వును అందజేస్తూ సీటు బెల్ట్ వినియోగం, ఓవర్ స్పీడ్ ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ దుష్ప్రభావాలు, రోడ్డు సిగ్నల్స్ పాటించాల్సిన అవసరం, రోడ్డు భద్రత ప్రాణ రక్షణ అంటూ పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మనోహర్ రెడ్డి, ఏ ఎం వీ ఐ లహరి మరియు వారి సిబ్బంది మాట్లాడుతూ, చిన్న జాగ్రత్తలే పెద్ద ప్రమాదాలను నివారిస్తాయని, ప్రతి పౌరుడు రోడ్డు భద్రతపై బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో గేట్స్ కరెస్పాండెంట్ పద్మావతమ్మ, డైరెక్టర్ శ్రీమతి శ్రీవాణి, ఎండి రఘునాథ రెడ్డి, ఏవో ఇంతియాజ్ బాషా, ట్రాన్స్పోర్ట్ ఇంచార్జ్ సాయినాథ్ రెడ్డితో పాటు అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఈ అవగాహన కల్పించారు.









