కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా / కాగజ్ నగర్ : రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
“అరైవ్ అలైవ్” కార్యక్రమం ఈ రోజు కాగజ్ నగర్ పట్టణం లోని పేపర్ మిల్లు నందు కాగజ్ నగర్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ నితికాపంత్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ద శుక్ల హాజరయ్యారు.
పేపర్ మిల్లు కార్మికులను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ…
వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు. దేశంలో గత సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో 1,07,000 మరణించగా, తెలంగాణ రాష్ట్రం నుండి సుమారు 8,000 మంది మరణించడం బాధాకరమైన విషయమని . మద్యం సేవించి వాహనం నడపడం, రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించక వాహనాలు నడపడం లాంటి నిర్లక్ష్యాల వల్ల రోడ్డు ప్రమాదాలు మరింత ఎక్కువ అవుతున్నాయని తెలిపారు.
సబ్ కలెక్టర్ శ్రద్ద శుక్ల మాట్లాడుతు
కార్మికులు, ప్రజలు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, వ్యక్తిగత భద్రతతోనే రోడ్డు ప్రమాదాలను నివారించడం సులువైన మార్గమని.ఓవర్ లోడ్ తో ప్రయాణించే వాహనాలు లోడ్ ను తగ్గించుకోవాలని, పేపర్ మిల్ కార్మికులందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో కాగజనగర్ డిఎస్పీ వాహిదుద్దీన్, ఎస్.పి.ఎం ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ అమరేంద్ర కుమార్ , జి.ఎం గిరి, ఎం.ఆర్.ఓ మధుకర్, ఎ.ఏం.వి.ఐ చంద్రశేఖర్, కాగజనగర్ పురపాలక కమిషనర్ తిరుపతి, సీఐ లు ప్రేమ్ కుమార్, కుమారస్వామి, ఎస్ ఐ సుధాకర్,ఫ్యాక్టరీ కార్మికులు పాల్గొన్నారు.









