ఖాళీ స్థలం కనిపిస్తే ఆక్రమణలే…ప్రభుత్వ భూములు ఖాళీగా ఉంటే రేకుల షెడ్లు, ప్రీకాస్ట్‌వాల్స్ వేసి అక్రమ నిర్మాణాలు చేయడం యథేచ్ఛగా జరుగుతున్నది. అంతేకాక ప్రభుత్వ భూముల్లో సర్కారు అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతున్నా చూసీ చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో అనేక అనుమనాలకు తావిస్తున్నది.

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కామారం గ్రామా శివారులో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు జరుగుతున్న ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. సర్కారు అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతున్నా చూసీ చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో అనేక అనుమనాలకు తావిస్తున్నది. సర్వే నంబర్ 166 / 1 / అ, 166 / అ / 1 / 2 లో సీలింగ్ భూమిలో SG స్నాక్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు అక్రమంగా పట్టా పొంది అక్రమ నిర్మణాలు చేపడుతున్నట్టు పూలపల్లి యాదగిరి యాదవ్ ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
ప్రభుత్వ అధికారులు మాత్రం స్పందించకపోవడంతో జిల్లాలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. కబ్జాలపై ఫిర్యాదులు వస్తే ఏదో నామా మాత్రంగా నోటీసులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారే తప్పా
ప్రభుత్వ భూములను రక్షించాలన్న సంకల్పం అధికారులకు ఉండటం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ఇకనైనా ధికారులు స్పందిస్తారా లేదా వేచి చూడాలి ..










