తెలంగాణ రాష్ట్రం – జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం (30-09-2022) రోజున కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (CCR) – పౌర, మానవ హక్కులు & ఆర్టీఐ సంస్థ (NGO) ఆధ్వర్యంలో ఎంపిడిఓ అనుమతితో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీ ఆంజనేయులు సమక్షంలో
కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చిన బడ్జెట్ యొక్క రికార్డ్ ల తనిఖీ చేయడం జరిగింది.
గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులకు ఖర్చు చేసిన లెక్కలు, పివిసి పైపులు, ట్రాక్టర్ డీజిల్, రిపేర్ లకు, వీధి విద్యుత్ దీపాలు కొనుగోలు, అలాగే ఇతర మెటీరియల్ కొన్నటువంటి రశీదులు, జీయస్టి కి సంబందించిన బిల్లులు (దాదాపు ₹. 50 లక్షల ప్రాథమిక అంచనా) లేవు అని చెప్పడం జరిగింది.
మరి కొన్ని పనుల బిల్లులు అడగగా అవి నాకు తెలియదు అని సెక్రెటరీ నిర్లక్ష్యంగా మాట్లాడటం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ లో సుమారు 50 లక్షలు రూపాయలు పైన అవినీతి జరిగినట్లు ప్రాథమిక అంచనాలు!
రికార్డ్ లను తనిఖీ చేసే కార్యక్రమం పూర్తి అయిన పిదప, రిపోర్ట్ పేపర్స్ పై తన సంతకం & ఆఫీస్ ముద్ర వేయకుండానే సెక్రెటరీ గారు ఆఫీస్ నుండి బయటకి వెళ్ళటం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిసిఆర్ సంస్థ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కమిటీ సెక్రటరీ చారకొండ బాబు, మరియు కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి జిల్లాల సెక్రటరీలు – గాడి దేవరాజు, రాముడు, యోహాను, జి.యన్. దేవరాజు, విక్రమ్ లు పాల్గొనడం జరిగింది.
తమ గ్రామ, మండలం, మున్సిపల్, జిల్లాలలో రికార్డుల తనిఖీల నిమిత్తం ఆర్టీఐ దరఖాస్తులు సమర్పించడానికి ఆసక్తి వున్న సభ్యులు (భారత పౌరులెవరైనా) సిసిఆర్ సంస్థ యొక్క సంబంధిత జిల్లా / జోనల్ కమిటీని సంప్రదించగలరని సిసిఆర్ సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ మంచికట్ల అనిల్ కుమార్ & తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ యెలిశెట్టి ప్రసాద్ తెలిపారు.
తదుపరి సిసిఆర్ సంస్థ ప్రతినిధులు సహాయ సహకారాలు ఇవ్వడం జరుగుతుంది.
ఇదివరకే ముందుకు వచ్చిన సభ్యులు వచ్చే రికార్డుల తనిఖీల ఫేజ్ కోసం సిసిఆర్ సంస్థ రికార్డుల తనిఖీల విభాగంతో ఫాల్లో అప్ లో వుండగలరు.
అవినీతి అంతం.. సిసిఆర్ సంస్థ పంతం..
కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (CCR) సంస్థలో జాయిన్ అవడానికి భారత పౌరులందరూ ఆహ్వానం అని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు తెలియజేశారు.
అవినీతి రహిత & అలసత్వం లేని భారత వ్యవస్థ మా లక్ష్యం
సిసిఆర్ సంస్థ ఆఫీషియల్ ఈమేల్: councilforcitizenrights@gmail.com
STATE SECRETARY & Zonal Secretary, COUNCIL FOR CITIZEN RIGHTS.
Mobile: 90145 86589, 70933 62679, 81063 29948, 94404 31353.










