- ములకలూరు అమ్మ ఒడి నిధులు దుర్వినియోగం పై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్
నరసరావుపేట: నరసరావుపేట మండలం ములకలూరు లో ఇటీవల జరిగిన 44 మంది విద్యార్థులకు సంబంధించి అమ్మఒడి నిధుల స్వాహా వ్యవహారంలో పల్నాడు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు పిల్లలు లేకుండా తల్లులైన లబ్ధిదారుల నుండి అమ్మ ఒడి పథకం డబ్బులను తిరిగి తీసుకునేందుకు చర్యలు తీసుకున్నారు ఈ నిధుల పక్కదారి పట్టడం లో తొమ్మిది మంది వాలంటీర్ ల ప్రమేయం ఉన్నట్లు విద్యాశాఖ, మండల పరిషత్ ఉన్నత అధికారులు జరిపిన సమగ్ర విచారణలో తేలింది. ఇందుకు బాధ్యులైన తొమ్మిది మంది వాలంటీర్ లను తక్షణమే విధుల నుండి తొలగిస్తూ కలెక్టర్ ఎల్ శివ శంకర్ ఆదేశాలు జారీ చేశారు. నిధుల స్వాహా వ్యవహారం పై గతంలో సచివాలయ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ను కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం పాఠకులకు విధితమే.