పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం వద్ద పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ (AE) జగదీష్ బాబును 90వేల రూపాయల లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ACB అధికారులు పట్టుకున్నారు.
ఈ దాడిని కరీంనగర్ ACB డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు నిర్వహించారు. ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రాజు నుంచి సీసీ రోడ్ బిల్లుల మంజూరుకు AE జగదీష్ బాబు 90వేలు డిమాండ్ చేసినట్లు సమాచారం. రాజు ACB అధికారులకు ఫిర్యాదు చేయగా, వారు పక్కా ప్లాన్ తో AEను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ప్రస్తుతం AE జగదీష్ బాబుపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. అధికారులు సేకరించిన ఆధారాలతో పాటు AE కార్యాలయంలో సోదాలు కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ప్రభుత్వ అధికారులపై నిఘా ఇంకా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రజల అభిప్రాయం.