మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో సహాయ కోశాధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న మమత అనే ఉద్యోగిని… ఖదీర్ అనే వక్తి నుండి నాలుగు వేల రూపాయలు లంచం తీసుకొంటుండగా ఏ సి బి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఖదీర్ వాళ్ల నాన్న ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి చనిపోవడంతో తన తల్లికి బెనిఫిట్స్ వస్తుందని తన తల్లి కూడా సంవత్సరం క్రితం చనిపోయిందని ఆ తరువాత ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ కోసం సంవత్సర కాలం నుండి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరు తనని పట్టించుకోవడం లేదని, పైసలిస్తేనే పని అవుతుందని ఐదు వేల రూపాయలు డిమాండ్ చేయగా చివరికి నాలుగు వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో 4000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మమతను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పై అధికారుల సూచనల మేరకు మమత తదుపరి విచారణ తర్వాత డిమాండ్ చేసే అవకాశం కూడా ఉందని ఏసీబీ అధికారులు మీడియా సమావేశంలో తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని టోల్ ఫ్రీ నెంబర్ 104 కి ఫిర్యాదు చేస్తే తాము చర్యలు తీసుకునే అవకాశం ఉందని అందరూ ముందుకు రావాలని వారు కోరారు