హైదరాబాద్ / అమీర్ పేట : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలలో ఏసీబీ ఆధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఎనిమిది చోట్ల సోదాలు చేస్తున్నారు. అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో కూడా తనిఖీలు చేస్తున్నారు. శివబాలకృష్ణ ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో పని చేస్తున్నారు. ఆయన తన పదవిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది. అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయం సహా రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.