అల్లూరి సీతారామరాజు జిల్లా- పాడేరు మండలం : కించూరు పంచాయతీ తోటలగొంది గ్రామానికి చెందిన గిరియనుడు జిరుగుల లక్ష్మయ్య ముగ్గురు పిల్లలు ఉండడానికి ఇల్లు సరైన తిండి లేక నిరుపేద కుటుంబానికి చెంది వారు పడే కష్టాలు ఇటీవల సోషల్ మీడియాలో చూసి చలించిపోయిన పాడేరు శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఆర్మీ లెఫ్టినెంట్ కల్నెల్ , 13వ బెటాలియన్ NCC విశాఖపట్నం నీరజ్ కుమార్ కు విషయం తెలిపారు. స్పందించి ఆ కుటుంబానికి మూడు నెలలకు సరిపడ నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు.
ఆ కుటుంబానికి పెద్ద దిక్కైన తండ్రి అనారోగ్యానికి గురై, చిన్నారులు అల్లాడిపోతున్న విషయాన్ని గమనించి, గూడు లేక ఒక పాక లో ఉండడం చూసి చలించిపోయిన ఎమ్మెల్యే మానవతా దృక్పథంతో తన సొంత నిధులతో ఇంటికి సరిపడ సిమెంట్ రేకులు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఆ కుటుంబానికి అండగా ఉండి అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు, ప్రతి నెల రేషన్ అందేలా చొరవతిసుకుంటానని బరోసా కల్పించారు,
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వంతాల రాంబాబు, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీధరి మంగ్లన్న దొర, బడిమెల సర్పంచ్ సోమెలి లక్ష్మణ రావు, మాజీ PACS చైర్మన్ తమర్బ వెంకటేశ్వర్లు నాయుడు, PACS డైరెక్టర్ పలాసి రామారావు, నాయకులు ముదిలి సత్యనారాయణ, పలాసి కోటేశ్వర రావు,మాజీ సర్పంచులు శరభ సూర్యనారాయణ, మినుముల కన్నపాత్రుడు, కించూరు వైస్ ప్రెసిడెంట్ గెమ్మెలి ఈశ్వర రావు, కే ఈశ్వర రావు, నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.