అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు: జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలను కట్టడి చేయాలని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి తాహశీల్దారులు, ఎంపిడిఒలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, భూముల ఆక్రమణలపై సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోర్టు కేసుల విషయంలో కోర్టు ఆదేశాల మేరకే వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములు, బంజరు భూములు, నీటి వనరులు వంటి సముదాయాలపై అక్రమంగా స్వాధీనం చేసుకున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆక్రమణదారులకు ముందుగా ఫారం 6 మరియు ఫారం 7 నోటీసులు జారీ చేయాలని, అనంతరం మాత్రమే తొలగింపు చర్యలకు వెళ్లాలని స్పష్టం చేశారు. అలాగే, భూముల నుండి ఆక్రమణ తొలగింపు ప్రక్రియకు జిల్లా కలెక్టర్ లేదా సబ్ కలెక్టర్ల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ శాఖల మధ్య సమన్వయం పెంచుతూ, భూ పరిరక్షణపై సీరియస్గా వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం.