- ఎమ్మార్పీఎస్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల.. టి.ఎం రమేష్ మాదిగ డిమాండ్
- పత్తికొండ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ ఎదురుగుండా పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడమైనది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తికొండ డివిజన్ ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండల కేంద్రంలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పై గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో అంబేద్కర్ విగ్రహం కు ఉన్న చేతిని విరగ్గొట్టి మొహం పై రాళ్లతో దాడి చేసి విగ్రహం ధ్వంసనికి ప్రయత్నించిన నిందితులపై పోలీసులు విచారణ జరిపి నిందితులను గుర్తించి వారిపై తక్షణమే రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ పంపాలి అంబేద్కర్ విగ్రహాలపై దాడులు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకొని రక్షణ కల్పించాలని కోరుతూ అనంతరం పత్తికొండ రెవెన్యూ డివిజన్ ఆర్డిఓ మోహన్దాస్ గారిని కలిసి డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించడం మైనది
ఈ కార్యక్రమంలో ఎమ్ ఆర్ పి ఎస్ ఎస్ లూఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ పెద్దరాజు మాదిగ, దేవనకొండ మండలం ప్రధాన కార్యదర్శి చెన్నకేశవులు మాదిగ, దేవనకొండ మండలం కార్యదర్శి హరి మాదిగ.
పత్తికొండ మండలం అధ్యక్షుడు రంగన్న మాదిగ, తుగ్గలి మండలం కార్యదర్శులు జొన్నగిరి నాగరాజు మాజీ ఎంపీటీసీ నాగరాజు మురళి దేవనకొండ మండలం యువజన కార్యదర్శి మల్లికార్జున ఎమ్మార్పీఎస్ ఎస్ నాయకులు దూదెకొండ శీను మాదిగ ముక్కెళ్ల రంజిత్ మాదిగ క్రిష్ణగిరి మధు మాదిగ తదితరులు పాల్గొన్నారు.