పేరుతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్‌సీఓఆర్ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పీని నిర్మిస్తున్న బిల్డర్‌కు హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తి పై బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్ రెడ్డి పిర్యాదు చేశారు. సోషల్ యాక్టివిస్ట్ , సోషల్ వర్కర్ అని బోర్డు పెట్టుకొని నిర్మాణం పనులు చూడడానికి వస్తున్న కస్టమర్లకు అసత్య ప్రచారం చేశాడు సదరు వ్యక్తి. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో దగ్గరి పరిచయం అని చెప్పి కలిసి దిగిన ఫోటోలు చూపి విప్లవ సిన్హా అనే వ్యక్తి వాట్స్అప్ కాల్ చేసి బెదిరింపులు పాల్పడుతున్నట్లు బిల్డర్లు తెలిపారు.
పిస్తా హౌస్ వద్ద కలుద్దామని చెప్పి అక్కడికి పిలిచి హైడ్రా రంగనాథ్‌తో కలిసి దిగిన ఫోటోలు చూపిస్తూ, రంగనాథ్ తనకు బాగా దగ్గరని అమీన్పూర్‌లో ఎలాంటి విషయమైనా తననే అడుగుతారని బెదిరింపులకు పాల్పడ్డాడని బిల్డర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘మీ నిర్మాణం జోలికి రావద్దు అంటే తనకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలి. లేదంటే హైడ్రా నందు ఫిర్యాదు చేస్తా, ప్రతిరోజు వార్తా పత్రికల్లో మీ నిర్మాణం గురించి తప్పుగా రాయిస్తా’’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. బిల్డర్ల ఫిర్యాదుతో సదరు వ్యక్తిపై అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.