contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కబ్జాదారులకు కొమ్ముకాస్తూ అమీన్పూర్ తహసీల్దార్ … ధర్నాకు దిగిన స్థానికులు

  • అమీన్పూర్ తహసిల్దార్ తీరు ఆక్షేపనీయం
    ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి
    తాసిల్దార్ వ్యవహార శైలితో ప్రభుత్వానికి చెడ్డపేరు
  • అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
  • ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా

సంగారెడ్డి జిల్లా / అమీన్పూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తుంటే, అమీన్పూర్ తాసిల్దార్ విజయకుమార్ వ్యవహార శైలితో నిరుపేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కబ్జాదారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తూ, నిరుపేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆయన విమర్శించారు.

తహసిల్దార్ విజయకుమార్ వ్యవహార శైలి నిరసిస్తూ మంగళవారం ఉదయం అమీన్పూర్ తాసిల్దార్ కార్యాలయం ఎదుట మున్సిపల్ పాలకవర్గంతో కలిసి నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన ఒక నిరుపేద కుటుంబం గత పది సంవత్సరాలుగా 100 గజాల స్థలంలో చిన్న గది నిర్మించుకొని నివాసము ఉంటుందని, నిరుపేదల కోసం ప్రభుత్వం కల్పించిన 58 59 జీవో కింద రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ ప్రతిఏటా ప్రభుత్వానికి పన్ను చెల్లింపులు సైతం చేస్తున్నారు అని తెలిపారు.

ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం తమ గది చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుకుంటే, ఎమ్మార్వో విజయ్ కుమార్ దౌర్జన్యంగా వ్యవహరించి తమ రెవెన్యూ సిబ్బందితో కలిసి కూల్చివేయడంతో పాటు అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులను దూషించడం జరిగిందని ఆరోపించారు.

ఈ అంశంపై తాను తాసిల్దారుని ప్రశ్నించగా, మంగళవారం ఉదయం కార్యాలయం వద్దకు రమ్మని చెప్పి, అందుబాటులో ఉండకపోవడం ఆయన వ్యవహార శైలికి అర్థం పడుతుందన్నారు.

ఎమ్మార్వో వ్యవహార శైలి నిరసిస్తూ సుమారు నాలుగు గంటల పాటు నిరసన చేపట్టిన ఎమ్మార్వో విజయకుమార్ స్పందించకపోవడం దారుణం అన్నారు.

గత మూడు సంవత్సరాలుగా అమీన్పూర్ మున్సిపాలిటీ తో పాటు మండల పరిధిలో ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్న చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ వ్యవస్థ నిమ్మకు నీరత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :