రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామానికి చెందిన ANM కొమ్ము మమత వైద్య ఖర్చుల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ 3,00,000/- లక్షల LOC పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు, మమత ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పి మమత దీన పరిస్థిని గురించి వివరించగా వెంటనే స్పందించి LOC మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ కి సహకరించిన ఆర్థిక మంత్రి శ్రీ హరీష్ రావు కి, ఆనంద్ కృతజ్ఞతలు తెలియజేశారు, NRI లు, దాతలు ముందుకు వచ్చి మమతకు సహాయం చేయాలని కోరారు, ఇప్పటి వరకు సామాజిక మాధ్యమాల ద్వారా మమత గురించి తెలిసి తోచిన సాహాయం చేస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు