ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులన్నీ కేంద్రం నిధులతోనే అని స్పష్టం చేశారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో గతుకుల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. ఏపీ రోడ్లపై సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటున్నారని తెలిపారు. రైతులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో కక్షపూరిత, విధ్వంస రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. ఏపీలో కుంభకోణాలపై కేంద్ర ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే వెళతాయని పురందేశ్వరి స్పష్టం చేశారు.