ఏపీలో ఎన్నికలు మరో 8 రోజుల్లో జరగనున్న నేపథ్యంలో, నేడు అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ డీజీపీ కె.రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ అలాగే విపక్షాల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఈసీ… ఈ మేరకు చర్యలు తీసుకుంది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ కావాలని డీజీపీని ఆదేశించింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు కేటాయించకూడదని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి డీజీపీ నియామకం కోసం ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితాను రేపు ఉదయం 11 గంటల లోపు పంపాలని ప్రభుత్వాన్ని కోరింది.