రాష్ట్రంలో 12 జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. పార్వతీపురం మన్యం కలెక్టర్‌గా ప్రభాకర్ రెడ్డి, విజయనగరం కలెక్టర్‌గా రామసుందర్ రెడ్డి, ఈస్ట్ గోదావరి కలెక్టర్‌గా కీర్తి చేకూరిని నియమించారు. గుంటూరు కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా, పల్నాడు కలెక్టర్‌గా కృతిక శుక్లా, బాపట్ల కలెక్టర్‌గా వినోద్ కుమార్‌లను నియమించారు. ప్రకాశం కలెక్టర్‌గా రాజా బాబు, నెల్లూరు కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా, అన్నమయ్య కలెక్టర్‌గా నిషాంత్ కుమార్‌లను నియమించారు. కర్నూలు కలెక్టర్‌గా డాక్టర్ ఏ.సిరి, అనంతపురం కలెక్టర్‌గా ఓ.ఆనంద్, సత్య సాయి కలెక్టర్‌గా శ్యాంప్రసాద్లను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం బదిలీ చేసిన 12 మందిలో నలుగురు కలెక్టర్లకు మరో జిల్లాలో పనిచేసే అవకాశం కల్పించింది. అనంతపురం కలెక్టర్‌ను బాపట్లకు, ప్రకాశం కలెక్టర్‌ను గుంటూరుకు, నెల్లూరు కల్టెక్టర్‌ను అనంతపురానికి, పార్వతీపురం మన్యం కలెక్టర్‌ను శ్రీ సత్యసాయి జిల్లాకు మార్చింది. మిగిలిన 8 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. మొత్తమ్మీద 12 జిల్లాల్లో కొత్త కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రసాయి పదవుల్లో ఉన్న కృతిక శుక్లా, హిమాన్షు శుక్లా, రాజాబాబు, ప్రభాకర్ రెడ్డి, కీర్తి, రామసుందర్ రెడ్డి, నిశాంత్ కుమార్, సిరి లాంటివారికి ఇప్పుడు జిల్లా కలెక్టర్లుగా బాధ్యతలు అప్పగించారు. వీరిలో కృతిక, హిమాన్షు గతంలో ఒకసారి కలెక్టర్లుగా చేశారు. ఇప్పుడు వారికి రెండోసారి కలెకర్టర్లుగా అవకాశం కల్పించారు. ఈ నెల 15, 16 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. కొత్త కలెక్టర్లకు పరిపాలన లక్ష్యాలను సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఆ రెండు రోజులు కలెక్టర్ల స్థానంలో జాయింట్ కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మానవీయ కోణంలో పని చేయండి: జిల్లాల కొత్త కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకమని సీఎం వ్యాఖ్యానించారు. తన ఆలోచనలు, అంచనాలు అందుకోని బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వాలని సూచించారు. సీఎం అంటే కామన్ మ్యాన్ అని చెపుతున్నానని, మీరూ అదే పాటించండన్నారు. అన్నింటికీ రూల్స్ కాదని, మానవీయ కోణంలో పని చేయాలని తెలిపారు. ఫేక్ ప్రచారాలు పెనుసవాల్‌గా మారాయని, రియల్ టైంలో కలెక్టర్లు స్పందించాలని వెల్లడించారు. ఇటీవల బదిలీ అయిన పలువురు ఐఏఎస్ అధికారులు: రాష్ట్ర పాలనా యంత్రాంగంలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే ప్రభుత్వం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గత కొద్ది రోజులుగా ఈ మార్పులపై సమీక్షలు జరిపి, పనితీరు ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. మంచి పని చేసిన అధికారులను ప్రోత్సహించేలా ఈ బదిలీలు అమలు చేసినట్టు తెలుస్తోంది. కీలక నియామకాలు: టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. గతంలోనూ ఆయన ఈ పదవిలో పనిచేసి అనుభవం సంపాదించారు. ఇప్పటి వరకు టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును జీఏడీ (పొలిటికల్) ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. జి. అనంతరామును గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఎం.టి. కృష్ణబాబు రోడ్లు, భవనాలు విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ముఖేశ్‌కుమార్ మీనాను రెవెన్యూ (ఎక్సైజ్) ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ, అదనంగా గనుల విభాగం బాధ్యతలు అప్పగించారు. ఇతర బదిలీలు: కాంతిలాల్ దండే – పర్యావరణ, అటవీ విభాగం కార్యదర్శి సౌరభ్ గౌర్ – ఆరోగ్యశాఖ కార్యదర్శి (అదనంగా పౌరసరఫరాలశాఖ కార్యదర్శి బాధ్యతలు) ప్రవీణ్‌కుమార్ – ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ సీహెచ్. శ్రీధర్ – మైనార్టీల సంక్షేమ కార్యదర్శి ఎంవీ. శేషగిరిబాబు – కార్మికశాఖ కార్యదర్శి ఎం. హరి జవహర్‌లాల్ – దేవాదాయశాఖ కార్యదర్శి












