అనంతపురం జిల్లా గుత్తి పట్టణం 19వార్డు లో జనవరి 1 వ తేదీన ఇవ్వాల్సిన ఎన్టీయార్ భరోసా పెన్షన్లు ఒక రోజు ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ గుత్తి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా లు మాట్లాడుతూ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్లలో పలు మార్పులు తీసుకురావడం పై ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనడానికి ఇదే నిదర్శనం అన్నారు పెన్షన్ లబ్ధిదారుడు ఎవరైనా చనిపోతే వారి భార్యకు వచ్చే నెలలోనే పెన్షన్ అందుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా 5402 మందికి కొత్త పెన్షన్ మంజూరు చేయడం జరిగిందని అదేవిధంగా గత రెండు నెలలుగా పెన్షన్ తీసుకొని వారు కూడా మూడు నెలలు ఒకేసారి పెన్షన్ తీసుకునే విధంగా చేయడం జరిగిందన్నారు అలాగే మిగిలిన పథకాలు కూడా త్వరిత గతిన అమలు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి,పవన్ కుమార్, సుధాకర్, జక్కల చెరువు ప్రతాప్ , రామకృష్ణ, చికెన్ శ్రీనివాసులు,వేణు, సరోజమ్మా తదితరులు పాల్గొన్నారు.