హంద్రీనీవా కాల్వను లైనింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు హంద్రీనీవా కాలువను వెడల్పు చేయాలి చేయాలనీ గుత్తి పట్టణంలో సిపిఎం కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాంభూపాల్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా పామిడి పట్టణంలో పబ్లిక్ మీటింగ్లో హంద్రీనీవా కాల్వను వెడల్పు చేసి 10,000 క్యూసెక్కుల నీటి సామర్ధ్యాన్ని తట్టుకునే విధంగా కాలువను వెడల్పు చేసి ప్రతి ఎకరాకు నీటి వసతి కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ వెడల్పు చేయడం వలన శ్రీశైలంలో నీరు ఈ కాలువలకి వదలడానికి వీలుంటుంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు 6450 కోట్లను కాలువ వెడల్పు చేయడానికి బడ్జెట్ ను కేటాయిస్తూ జీవో తీసుకురావడం జరిగింది. మరి టిడిపి గెలిచిన తర్వాత హంద్రీనీవా కాలువను వెడల్పు కాదు, లైనింగ్ చేస్తామంటున్నారు. ఈ లైనింగ్ చేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇది చేయడం వలన అనంతపురానికి ఒక శాపం మాదిరి ఉంటుంది. ప్రభుత్వం స్పందించి కాల్వ వెడల్పు చేయకుంటే రాయలసీమ నాలుగు జిల్లాల్లో ప్రతి గ్రామానికి ఈ సమస్య తెలియజేసి హంద్రీనీవా కాలువ వెంబడి పాదయాత్ర చేస్తాము, అదేవిధంగా రాయలసీమలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాల దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
తాడపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన నూతన సెలబ్రేషన్ లో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాన్ని బిజెపి ఒక మత ఘర్షణగా సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తుంది. కొంతమంది బిజెపికి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ బుర్కాలు వేసుకున్న వారు ఆ నూతన సంవత్సరం వేడుకల్లో ఎక్కువమంది పాలుపంచుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ జెసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే సహించేది లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా అనంతపురం పట్టణంలో జెసి ప్రభాకర్ రెడ్డి కి సంబంధించిన బస్సు దగ్ధం కావడం జరిగింది. అయితే ఆయన పత్రిక సమావేశం నిర్వహించి ఆ బస్సును బిజెపి వారే దగ్ధం చేశారని బహిరంగంగా చెబుతున్నా పోలీస్ అధికారులు మాత్రం నిజంగా బస్సు ఎవరైనా నిప్పు పెట్టారా లేదా ఏమైనా ప్రమాదం జరిగిందా అనే విషయాన్ని తేల్చలేకపోతున్నారు. ఇలాంటి విషయాలు వల్ల జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆ బస్సు ప్రమాదం నిజ నిజాలు తెలియచేయాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి శ్రీనివాసులు, గుత్తి మండల కార్యదర్శి నిర్మల, జిల్లా కమిటీ సభ్యులు కసాపురం రమేష్, మండల నాయకులు రామకృష్ణ, రమేష్, మల్లికార్జున, రేణుక తదితరులు పాల్గొన్నారు.