అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ప్రత్యామ్నాయ విధానాలపై వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రైతులకు, వ్యవసాయ కూలీలకు, విద్యకు, వైద్యానికి, అసంఘటిత కార్మిక రంగానికి నిధులు కేటాయింపులలో స్థానం ఇవ్వలేదు. కాబట్టి క్షేత్రస్థాయిలో వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు కలసి ప్రతి ఒక్క ప్రజానీకానికి తెలిసే వరకు ప్రచారం గావించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ రెడ్డి, సిపిఐ జిల్లా నాయకులు గోవిందు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు సురేష్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్ర స్వామి, సిపిఎం డివిజన్ నాయకుడు భజంత్రీ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మహేష్, గోపీనాథ్, రాము రాయల్, ఎస్ ఎండి గౌస్ ,రామాంజనేయులు, సిపిఎం మారుతి, మహిళా ఐద్వా నాయకులు, ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
